Header Banner

ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్.. పన్ను ఆదా చేయాలంటే, మార్చి 31 లోపు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయండి!

  Fri Mar 14, 2025 15:13        Business

ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్.. పన్ను ఆదా చేయాలంటే, మార్చి 31 లోపు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 మార్చి 31న ముగియనుంది. 2025 సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్ (ITR) సీజన్ ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. పాత పన్ను విధానంలో పన్ను ఆదా చేయాలనుకుంటే, వివిధ ట్యాక్స్‌ సేవింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు మార్చి 31 వరకు సమయం ఉంది. అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది అత్యంత సాధారణ ట్యాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్‌. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిడక్షన్‌ అందిస్తుంది. అర్హత కలిగిన పెట్టుబడులు ఇవే..

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(EPF): కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఈ రిటైర్‌మెంట్‌ సేవింగ్‌ స్కీమ్‌కి కాంట్రిబ్యూట్‌ చేయాలి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. పన్ను రహిత రాబడిని అందిస్తుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌తో వచ్చే ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ స్కీమ్‌.

ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ: 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వచ్చే బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS): 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉన్న మ్యూచువల్ ఫండ్లు.'

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియంలు ఈ విభాగం కింద డిడక్షన్‌కి అర్హత పొందుతాయి.

సుకన్య సమృద్ధి యోజన (SSY): ఆడపిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ఈ స్కీమ్‌ను రూపొందించింది.

ట్యూషన్ ఫీజు: గుర్తింపు పొందిన సంస్థలలో పిల్లల విద్య కోసం చెల్లించే ఫీజులపై కూడా డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు.

హోమ్‌ లోన్‌ ప్రిన్సిపల్: హోమ్‌ లోన్‌ ప్రిన్సిపల్ అమౌంట్‌ రీపేమెంట్‌పై కూడా డిడక్షన్‌ పొందవచ్చు.

సెక్షన్ 80D..

మీకు, మీ కుటుంబానికి, తల్లిదండ్రులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం చెల్లించిన ప్రీమియంలపై డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సెల్ఫ్‌, జీవిత భాగస్వామికి, పిల్లలకు రూ.25,000, తల్లిదండ్రులకు(సీనియర్ సిటిజన్లు) రూ.50,000 డిడక్షన్‌ చేయవచ్చు. ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్స్‌కు అదనంగా రూ.5,000 క్లెయిమ్‌ చేయవచ్చు.


ఇది కూడా చదవండి: SIPB ఆమోదించిన ప్రతిపాదనలు! భవిష్యత్తులో భారీ ఉద్యోగాలు!

 

సెక్షన్ 80E..

ఉన్నత చదువుల కోసం తీసుకున్న ఎడ్యుకేషన్‌ లోన్‌పై చెల్లించే వడ్డీని పూర్తిగా డిడక్ట్‌ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. కానీ తిరిగి చెల్లించడం ప్రారంభించినప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

సెక్షన్లు 80EE & 80EEA..

80EE కింద హోమ్‌ లోన్‌ వడ్డీపై మొదటిసారి ఇల్లు కొనుగోలుదారులకు రూ.50,000 అదనపు మినహాయింపు లభిస్తుంది. 80EEA కింద ఆఫర్డబుల్‌ హౌసింగ్‌ లోన్స్‌కి రూ.1.5 లక్షల వరకు డిడక్షన్‌ క్లెయిమ్‌ చేసే అవకాశం ఉంది.

సెక్షన్ 80G..

అర్హత ఉన్న ఛారిటీలకు ఇచ్చే విరాళాలను డిడక్షన్‌ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని విరాళాలపై 100%, మరికొన్నింటిపై 50% డిడక్షన్ ఉంటుంది.

సెక్షన్ 80GG..

మీరు రూమ్ రెంట్ చెల్లిస్తూ HRA పొందకపోతే, డిడక్షన్‌ క్లెయిమ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి రూ.60,000 లేదా మొత్తం ఆదాయంలో 25%, ఏది తక్కువైతే అది లభిస్తుంది.

సెక్షన్ 24(b)..

సెల్ఫ్‌ ఆక్యుపైడ్‌ హౌస్‌కి గృహ రుణ వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు డిడక్షన్‌ పొందవచ్చు.

NPS..

80CCD(1): 80C లిమిట్‌లో జీతంలో 10% వరకు (స్వయం ఉపాధి పొందేవారికి 20%) డిడక్షన్‌ లభిస్తుంది.

80CCD(1B): దీని కింద NPS కాంట్రిబ్యూషన్‌లకు రూ.50,000 అదనపు డిడక్షన్‌కి అర్హత లభిస్తుంది.

80CCD(2): జీతంలో 10% వరకు కంపెనీ కాంట్రిబ్యూషన్‌పై (80C పరిమితిలో భాగం కాదు) డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు.

సెక్షన్ 80TTB:

సీనియర్ సిటిజన్లు సేవింగ్స్‌ అకౌంట్లు, FDలు, పోస్టాఫీసు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ.50,000 వరకు డిడక్షన్‌ క్లెయిమ్ చేసుకోవచ్చు.

2025 ఐటీఆర్‌ సీజన్..

2025 ఏప్రిల్ 1 నుంచి 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కి ITR ఫైలింగ్ ప్రారంభించవచ్చు. జీతం పొందే ఉద్యోగులు వారి కంపెనీల నుంచి ఫారమ్ 16ని అందుకుంటారు. ఇది సంవత్సరంలో వారి జీతం వివరాలు, పన్ను తగ్గింపును చూపుతుంది. ట్యాక్స్‌లు డిడక్ట్‌ అయ్యాయని, ప్రభుత్వానికి చెల్లించారనేందుకు ఇది ప్రూఫ్‌గా పనిచేస్తుంది.

 

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ! ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు..

 

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tax #Business #EPF #PPF #NSC #BusinessNews #March31Last